ఈ ప్రదేశాలకు వెళ్తే మీ పని ఇంకా ఫసక్..
TV9 Telugu
22 March 2024
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో మొదటి స్థానంలో నిలిచింది పశ్చిమ ఆసియాలోని ఒక దేశం అయినా సిరియా.
'ఇల్హా డి క్యూమాడా గ్రాండే' అనే అధికారిక పేరుతో పిలవబడే బ్రెజిల్‌లోని స్నేక్ ఐలాండ్ చాల ప్రమాదకరమైన ప్రదేశ్.
తూర్పు ఆఫ్రికాలోని దనకిల్ ఎడారి అనేక విష వాయువులు, అగ్నిపర్వతాలతో అత్యంత ప్రతికూలమైన, ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి.
ఆఫ్రికాలోని ప్రసిద్ధ సహారా ఎడారి సరిహద్దులో సహెల్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోని పరిమిత నీటి వనరుల కారణంగా ప్రమాదకరంగా చెబుతారు.
రష్యన్ గ్రామమైన ఒమియాకోన్ ప్రదేశంలో భయంకరంగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల చాల ప్రమాదకరం. ఇది ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి.
బ్రెజిల్‌లోని తీర రాష్ట్రం అలగోస్ లోని కొన్ని ముఖ్యమైన మహానగరాలు చాలా ఎక్కువ నేరాల రేటును కలిగి ఉన్నాయి.
ఆఫ్రికన్ ఖండంలోని మన్రోవియా లైబీరియా దేశానికి రాజధాని. కఠినమైన జీవన పరిస్థితులతో సుమారు 75,000 మంది ప్రజలు ఇక్కడ మురికివాడలో ఉన్నారు.
ఇండోనేషియా ద్వీపం సుమత్రాలోని మౌంట్ సినాబంగ్ సందర్శించడానికి ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ తీవ్రమైన విస్ఫోటనాలు తరచుగా జరుగుతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి