ఒడిశాలో కొన్ని ఫేమస్ డిఫరెంట్ ఫుడ్స్ ఇవే..

TV9 Telugu

11 January 2024

ఆహారం అనేది ప్రతి జీవికి జీవనాధారం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నో రకాల రుచికరమైన, ఫేమస్ వంటకాలు ఉన్నాయి.

అలాగే దక్షణాది రాష్ట్రం ఒడిశాకిలో ఆహారాలలో కొన్ని ప్రత్యక ఆహారాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తేలుకొందాం.

మొదటిగా గజపతి జిల్లాకు చెందిన ఖజూరి గూడ అనేది ఒడిషాలోని ఒక స్వీట్ డిష్. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ధెంకనల్ మగ్జి ఒడిషాలోని మరో స్వీట్ డిష్. గేదె పాల చీజ్‌తో తయారు చేసిన వీటిని బంతులుగా తయారు చేస్తారు.

మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మయూర్భంజ్ కై చట్నీ. దిన్ని ఎరుపు నేత చీమలను మెత్తగా నూరి మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, ఉప్పుతో కలిపి చేస్తారు.

నయాగర్ కంటెముండి వంకాయ 100 ఏళ్లనాటి ఆహారం. ఈ వంకాయని ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా అక్కడి రైతులు పండిస్తారు.

బలదేవ్‌జేవ్ ఆలయంలో భోగ్ (నైవేద్యం)గా ఉపయోగించే 262 ఏళ్ల చరిత్ర కలిగిన తీపి వంటకం కేంద్రపర రసబలి ఒడిశాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వంటకం.

కోరాపుట్ కలజీర బియ్యం ఒడిశాలో స్థానిక బియ్యం. ఈ భయాని జీలకర్ర పొడితో కలిపి స్టోర్ చేస్తారు. ఇవి మధుమేహ రోగులకు చాల మేలు చేస్తాయి.