TV9 Telugu

నీటిపై తేలుతూ ఉండాలని ఉందా.? అయితే ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే..

23 Febraury 2024

మనుషులను ఆశ్చర్యపరిచే ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అలాంటి ప్రదేశం ఈజిప్టులో కూడా ఒకటి ఉంది.

ఈజిప్టు దేశంలోని ఉన్న ఒక సరస్సును మాయా సరస్సుగా పిలుస్తారు. ఈ సరస్సులో ఎవరూ కూడా అస్సలు మునిగిపోలేరు.

ఈజిప్టు దేశంలోని ఉన్న ఈ ప్రత్యేకమైన సరస్సును 'శివా ఒయాసిస్' లేదా 'సాల్ట్ పూల్స్' అనే పేర్లతో పిలుస్తారు.

దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి ఈ సరస్సుపైన తేలుతూ కనిపించాడు.

ఆ వ్యక్తి నీటిపై ఎలా తేలుతున్నాడో, మునిగిపోకుండా ఎలా ఉన్నాడో వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడవచ్చు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా సన్నిహితులకు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

నిజానికి నాలుగు మీటర్ల లోతున్న ఈ సరస్సులో 95 శాతం ఉప్పు ఉంటుంది. ఈ సరస్సులో ఎవరూ మునిగిపోకపోవడానికి ఇదే కారణం.

ఎడారి ప్రాంతం మధ్యలో ఉన్న ఈ విశిష్టమైన సరస్సును చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి పర్యాటకలు వస్తుంటారు.