14 March 2024
TV9 Telugu
Pic credit - Pexels
గ్రామీణ ప్రాంతాలు, అడవులలో ప్రజలు తరచుగా పాము కాటుకు గురవుతారు. 3 గంటల వ్యవధిలోనే చికిత్స చేయకపోతే మరణిస్తాడు.
పాము కాటేస్తే విషం వ్యాపిస్తుందనే భయం ఎక్కువ కలుగుతుంది. పాము కరిచిన భాగాన్ని ఎక్కువగా కదలకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పాము కాటు తర్వాత అక్కడ రక్తస్రావం జరగనివ్వండి. దానిని ఆపడానికి ప్రయత్నించకండి. రక్తంతో పాటు విషం కూడా శరీరం నుండి బయటకు వస్తుంది.
రక్తస్రావం ఆగిపోయినట్లయితే.. పాము కాటుపై బెటాడిన్ జెల్ రాయవచ్చు. ఇది విషం వ్యాప్తి చెందకుండా ఆపడానికి సహాయపడుతుంది.
ప్రథమ చికిత్స తర్వాత బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లండి. ఇంట్లో పూర్తిగా చికిత్స చేయడానికి ప్రయత్నించవద్దు.
విషపు పాము కరిచిన వెంటనే కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు తీయాలి
పాము కాటుకు గురైన గాయం ఎంత లోతుగా ఉందో ముందుగా పరిశీలించండి. తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆస్పత్రికి వెళ్లిన తర్వాత తెలుస్తుంది.
అలాగే హాస్పిటల్‌లోని డాక్టర్ పాము ఎంత విషపూరితమైందో.. ప్రాణాలను రక్షించడానికి చేయడానికి ట్రీట్మెంట్ చేస్తారు.