పొగ తాగేవారిలో ప్రధానంగా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత రోగాలు వస్తాయిని మనందరికీ తెలిసిందే. అయితే స్మోకింగ్‌తో డయాబెటిస్ తప్పదని నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలంగా స్మోకింగ్ చేసే వారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
డయాబెటిస్ వచ్చిన తర్వాత కూడా ధూమపానం కొనసాగిస్తే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు తప్పవని పరిశోధకులు చెబుతున్నారు.
స్మోకింగ్ అలవాటు లేనివారితో పోల్చితే పొగతాగేవారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ముప్పు 30-40 శాతం ఎక్కువని అధ్యయనంలో వెల్లడైంది.
ఇక ధూమపానం మానేస్తే షుగర్ వ్యాధి వచ్చే ముప్పు కూడా 40 శాతం వరకు తగ్గుతుందని తెలిపింది. కాబట్టి స్మోకింగ్ మానేస్తే షుగర్ వ్యాధికి కూడా చెక్ పెట్టొచ్చు.
కేవలం పొగతాగేవారు మాత్రమే కాకుండా వారి పక్కన ఉండే వారిలో కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణంగా స్మోకింగ్ చేసినప్పుడు శరీరంలోకి 7 వేలకుపైగా రసాయనాలు వెళ్తాయి. వీటిలో 69 రసాయనాలు క్యాన్సర్ ముప్పు ఉంటుందన్నారు.
స్మోకింగ్ కారణంగా వచ్చే డయాబెటిస్‌తో కంటి రెటీనాపై కూడా ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కంటి చూపు తగ్గుతుందని చెబుతున్నారు.