స్మోకింగ్‌ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసా?

12 August 2024

TV9 Telugu

TV9 Telugu

పొగాకు ఆరోగ్యాన్ని గుల్లచేస్తోంది. దీనిమూలంగా పెద్దసంఖ్యలో ప్రజలు క్యాన్సర్ల బారిన పడుతున్నారు. పొగాకు వినియోగంవల్ల తలెత్తే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు

TV9 Telugu

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ ఆ వ్యసనాన్ని వదలించుకోవాలనుకున్నా ఆ పని చేయలేకపోతున్నవారు చాలా మందే ఉన్నారు. ఇందుకు కారణం.. పొగాకు ఉత్పత్తుల్లోని నికొటిన్‌కు అలవాటు పడటమే

TV9 Telugu

అధిక ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లోకి పొగ చేరి శ్వాసనాళాలు మూసుకుపోతాయని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా శ్వాస సమస్యలు మొదలవుతాయి

TV9 Telugu

అధిక ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కారణాలలో ఒకటి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సిగరెట్లలోని క్యాన్సర్ కారకాలు ఊపిరితిత్తులలోని DNA ను నాశనం చేస్తాయి

TV9 Telugu

సిగరెట్‌లలో నికోటిన్ కాకుండా అనేక విష పదార్థాలు కూడా ఉంటాయి. ఫలితంగా శ్వాసకోశ, నోటి కుహరం, కాలేయం, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది

TV9 Telugu

అధిక ధూమపానం కూడా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. రక్తపోటు పెరిగినప్పుడు, రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఇది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది

TV9 Telugu

ధూమపానం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా అధిక ధూమపానం వల్ల టైప్-2 మధుమేహం కూడా వస్తుంది. ఇది కిడ్నీ సమస్యలను కూడా కలిగిస్తుంది

TV9 Telugu

ధూమపానం చేసే స్త్రీలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదానికి గురవుతారు. అంతేకాకుండా గర్భస్రావం ప్రమాదం కూడా పెరుగుతుంది