నిద్రలేమితో ఆ ముప్పు కూడా.. మహిళల్లోనే. 

30 November 2023

నిద్రలేమితో వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయనే విషయం తెలిసిందే. అయితే నిద్రలేమితో మధుమేహం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఈ మధుమేహ ముప్పు ఎక్కువగా ఉంటుందిన ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైన ఈ విషయాలను డ‌యాబెటిక్ కేర్ జ‌ర్న‌ల్‌లో ప్రచురితం చేశారు. 

మహిళల్లో టైప్‌ టూ డ‌యాబెటిస్ ముప్పును త‌గ్గించేందుకు కంటి నిండా నిద్ర ఉండాలని ఈ అధ్యయనంలో వెల్లడైంది. 

నిద్రలేమి మహిళల ఆరోగ్యకర జీవితకాలంపై ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలింది. రుతుక్రమంలో ఆగిపోయిన వారిలోనే ఈ ప్రభావం ఎక్కువని తేలింది. 

పురుషుల కంటే ఎక్కువ మహిళలే నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నట్లు నేష‌న‌ల్ హార్ట్‌, లంగ్‌, బ్ల‌డ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

20 నుంచి 75 ఏళ్ల వయసున్న మహిళలపై చేపట్టిన అధ్యయనంలో నిద్రలేమి మహిళలపై దుష్ప్రభావం చూపుతుందని తేలింది. 

రాత్రి సమయంలో కేవలం 6 గంటలు మాత్రమే నిద్రించిన మహిళల్లో టైప్‌ 2 మధుమేహ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.