నిదురమ్మ ఎటుపోతివే..!
31 July 2023
Pic credit - Pexels
పడుకోగానే హాయిగా నిద్రపోవాలని ఎవరికుండదు. కొంత మందికి పడకపై ఎంత మెసిలినా నిద్ర పట్టదు. ఈ ఇబ్బంది మహిళల్లోనే ఎక్కువట
ఐతే జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే నిద్ర సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు
గది చీకటిగా ఉంటే గాఢ నిద్రకు ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ చక్కగా పని చేస్తుంది
అందుకే పడక గదిలో జిగేల్‌మనే లైట్లూ, టీవీలూ, కంప్యూటర్, ఫోన్‌లన్నీ ఆఫ్ చేసెయ్యాలి
గది ఉష్ణోగ్రత అతి శీతలం, అతి వేడిగా కాకుండా సమంగా ఉండేలా చూసుకోవాలి
మంచంపై దుప్పట్లు, దిండ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి
కాస్త పచ్చ కర్పూరం లేదంటే సాంబ్రాణి పొగ వేస్తే మనసుకి హాయినిచ్చి కమ్మటి నిద్రపట్టేలా చేస్తుంది
రాత్రి పడుకునే ముందు వీలైనంత వదులుగా ఉండే దుస్తులు ఎంచుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది
ఇక్కడ క్లిక్ చేయండి