నిదురమ్మ ఎటుపోతివే..!

రాత్రి పడుకోగానే మంచి నిద్ర పట్టాలంటే..

గది చీకటిగా ఉంటే నిద్రకు సాయపడే మెలటోనిన్‌ హార్మోను చక్కగా పనిచేస్తుంది

లైట్లూ, టీవీలూ, కంప్యూటర్‌, ఫోన్‌ అన్నింటినీ మూసెయ్యాలి

చక్కటి నిద్రకు గది ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం

అతి వేడి, అతి చల్లగా కాకుండా సమంగా ఉండేలా చూసుకోవాలి

పగకగదిలో కాస్త పచ్చ కర్పూరం లేదంటే సాంబ్రాణి పొగ వేస్తే సువాసనలు మనసుకి హాయినిస్తాయి

పడక శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

దుప్పట్లు, దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ధరించే దుస్తులు వీలైనంత వదులుగా ఉండేవి ఎంచుకోవాలి