అందంగా కనిపించాలని ముఖానికి మేకప్ వేస్తుకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ చర్మంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఉంటే.. మేకప్ సరిగా రాదు
మరి మచ్చల్ని పోగొట్టాలంటే మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగించాలి కదా అని అనుకుంటున్నారా? అవసరం లేదు.. ఇంట్లోనే ఈ చిట్కాలుపాటిస్తే సరి..
నిమ్మరసం మచ్చల్ని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్ సి ఉంటుంది. ఇది మచ్చలను తొలగించడంలో సాయపడుతుంది
రెండు స్పూన్ల నిమ్మరసంలో కాటన్ క్లాత్ ముంచి మచ్చలపై ఐదు నిమిషాలు మర్దన చేసి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా మచ్చలు మాసిపోతాయ్
మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ముఖంపై ఉన్న మృతకణాలను తొలగించి నల్ల మచ్చలను దూరం చేస్తుంది. అరకప్పు మజ్జిగలో దూది ముంచి మచ్చలపై రాయాలి
ఒక పావుగంట పాటు ఆరనిచ్చి ఆపై నీళ్లతో కడిగితే సరిపోతుంది. అలాగే కలబంద రసాన్ని మచ్చలపై రాసి అరగంట తర్వాత శుభ్రం చేస్తే చాలు. ఇందులో ఉండే అలోయిన్ అనే కాంపౌండ్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది
టొమాటో గుజ్జు స్కిన్ టోనర్‌గా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మచ్చలు తొలగిపోతాయి
బొప్పాయిలోని ఖనిజాలు మచ్చలను దూరం చేసి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మచ్చలు తొలగిపోతాయి