ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా నాన్‌వెజ్ వంటకం తినేందుకు ఆసక్తి చూపుతారు. మార్కెట్లో నాన్‌వెజ్ తెచ్చుకోవడానికి క్యూకడతారు
TV9 Telugu
చికెన్ కావాలంటే షాప్‌కి వెళ్తే చాలావరకు అప్పుడే కట్‌చేసి ఫ్రెష్‌గా ఇస్తుంటారు. కానీ మటన్ అలా కాదు. దీంతో మనం కొనే మటన్ తాజాదేనా? అనే డౌట్ వస్తుంది
TV9 Telugu
అలెప్పుడో ఎప్పుడో కట్ చేసిన మాంసాన్ని అమ్ముతున్నారేమోననే సందేహంతో ఆందోళన పడుతుంటారు. దీనిని ఇంటికి తీసుకెళ్లి వండాలంటే తటపటాయిస్తూ ఉంటారు
TV9 Telugu
మీరు కొనే మటన్ తాజాది అవునా? కాదా అనే అనుమానంతోనే చాలామంది మటన్ కొనడానికి కూడా వెనుకముందు అవుతుంటారు. కానీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు
TV9 Telugu
కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తాజా మటన్‌ను గుర్తించవచ్చు. మంచి మటన్, చికెన్ తాజాగా కనిపిస్తుంది. ఎప్పుడో కట్ చేసిందైతే పాలిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది
TV9 Telugu
మటన్ తీసుకునేటప్పుడు దాని నుంచి ఎక్కువగా రక్తం లేదా నీరు కారుతున్నట్లు కనిపిస్తే దాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. తాజా మటన్ అలా కనిపించదు
TV9 Telugu
బాగా ఎరుపు రంగులో ఉంటే అది ముదిరిపోయిన మటన్ అని అర్థం చేసుకోవాలి. అందులో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ అయితేనే ఆరోగ్యానికి మంచిది
TV9 Telugu
చాలామంది బోన్‌లెస్ మటన్ తినేందుకు ఇష్టపడుతుంటారు. నిజానికి బోన్‌లెస్ కన్నా కూడా బోన్ మటన్ రుచిగా ఉంటుంది. బోన్స్ ఉన్న మటన్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. పైగా బొక్కలు ఉన్న మటనే త్వరగా ఉడుకుతుంది