చెప్పులు కరుస్తున్నాయా.. ఐతే ఇలా చేయండి

January 28, 2024

TV9 Telugu

చెప్పులు లేకుండా నడవటం ప్రస్తుతం రోజుల్లో అసాధ్యం. బయటికి ఎక్కడికి వెళ్లాలన్నా డ్రెస్‌కి మ్యాచింగ్‌ కుదిరేలా రకరకాల డిజైన్‌ చెప్పులు ధరిస్తుంటారు

రోజువారీ జీవితంలో పార్టీవేర్‌, ఆఫీస్‌వేర్‌ అంటూ రకరకాల పాదరక్షలు వాడేస్తుంటాం.. కొత్త చెప్పులు చూడటానికి బాగానే ఉన్నా వేసుకున్నప్పుడు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి

కొత్త చెప్పులు ధరించినప్పుడు చెప్పులు, పాదాల మధ్య రాపిడి ఏర్పడి అసౌకర్యంగా ఉంటంఉది. దీంతో సరిగ్గా నడవలేం. అంతేకాకుండా పాదాలపై చిన్నచిన్న గాయాలు, దద్దుర్లు ఏర్పడతాయి

కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు సౌకర్యవంతంగా ఉండటానికి, పాదాలపై గాయాలు, దద్దుర్లు రాకుండా నివారించడానికి  కొన్ని చిట్కాలను పాటించాలి

ఎప్పుడైనా కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కాళ్లకు హెయిర్‌ సీరమ్‌, కొబ్బరినూనె, పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు, చెప్పుల మధ్య రాపిడి ఏర్పడదు

ఫలితంగా చెప్పులు కరవకుండా ఉంటాయి. ఒక్కోసారి హైహీల్స్‌ వేసుకున్నా, వదులుగా ఉన్న చెప్పులు వేసుకున్నా, కొత్త షూతో నడుస్తున్నా ఇబ్బంది పడుతుంటాం

ఈ సమస్యల్ని తగ్గించుకోవాలంటే హైహీల్‌ ప్యాడ్‌లు, స్కిన్‌కలర్‌ సాక్సులు ఉంటాయి. వీటిని ధరించి సౌకర్యవంతంగా నడవచ్చు. ఆలివ్‌ నూనె, బాదం నూనెను సమపాళ్లలో కలిపి చెప్పులు కరిచిన చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది

చెప్పులు కరిచిన చోట మెత్తని వస్త్రంలో ఐస్‌ముక్కలు వేసి కాపడం పెట్టాలి. లేదంటే బొబ్బలు ఏర్పడిన చోట కలబంద గుజ్జు రాయాలి. ఇలా చేస్తే వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది