మీలోనూ అభద్రతా భావం ఉందా? ఇలా అధిగమించండి..

January 26, 2024

TV9 Telugu

కొంతమంది అభద్రతా భావంలోనై ఇతరుల నమ్మకాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది సమర్థత ఉన్నా తమను తాము తక్కువగా అంచనా వేసుకుని అభద్రతకు లోనవుతుంటారు

నిజానికి.. ప్రేమ, స్నేహం.. ఏ బంధమైనా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే అది శాశ్వతమవుతుంది. అయితే  విభిన్న కారణాలతో అభద్రతా భావానికి లోనై మానసిక వేదన పడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది

అసలు అభద్రతా భావం నుంచి ఎలా బయటపడాలంటే.. మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే వాటిని సరైన రీతిలో వినియోగించుకుంటారు

అభద్రతా భావం ఉన్న వారు సరిగా పని చేసినా తరచుగా ఇతరుల అభిప్రాయం కోరుతుంటారు. అవతలి వారి నుంచి సానుకూల స్పందన వస్తేనే సంతృప్తి పడడం.. లేదంటే బాధపడడం వంటివి చేస్తారు

ఇలాంటి వారు స్వీయ నమ్మకం పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఇకొక విషయం ఏంటంటే.. అభద్రతకు లోనయ్యే వారు ఇతరులతో ఎక్కువగా పోల్చుకుంటూ ఉంటారు 

వారు సాధించిన విజయాలనే తాము సాధించాలని ఆరాటపడడం, వారిపై అసూయ పడడం, ఈ క్రమంలో వాటిని చేరుకోలేకపోతే కుంగిపోవడం వంటివి అభద్రతకు లోనయ్యే వారిలో కనిపించే లక్షణాలు

అభద్రతా భావం ఉన్న వారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి బదులుగా కప్పిపుచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారి లోపాలకు ఇతరులను బాధ్యులను చేస్తూంటారు

తమపై తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, స్వీయ ప్రేమను పెంచుకోవడం చేయాలి. ఇలాంటి స్వభావం ఉన్నవారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది