TV9 Telugu
27 March 2024
ఈ లaక్షణాలుంటే.. విటమిన్ డీ ఎక్కువైనట్లే
విటమిన్ డీ ఎక్కువగా ఉంటే వికారంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో వాంతులు కూడా ఉంటాయి.
మలబద్ధకం సమస్య కూడా విటమిడ్ డీ లోపం వల్ల వస్తుంది. ఈ సమస్య ఎక్కువ రోజులు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి.
విటమిన్ డీ లోపం కారణంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.
మరికొందరిలో విటమిన్ డీ ఎక్కువైతే త్వరగా అలసిపోతుంటారు. తరచూ అలసట ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
విటమిన్ డీ ఎక్కువైతే డీహైడ్రేషన్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దాహం కూడా ఎక్కువయ్యే అవకాశాలున్నాయి.
అవసరానికి మించి శరీరానికి విటమిన్ డీ అందించే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ అందితే ఎముకలు బలహీనంగా మారుతాయి.
శరీరానికి ఎక్కువగా విటమిన్ డీ అందితే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ కావొచ్చని అంటున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..