టమాట తింటే ప్రమాదామా.?
TV9 Telugu
11 February 2024
టమాట కారణంగా ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో గుణాలు గుండెతో పాటు ఇతర అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం అజీర్ణ సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని సల్మోనిలా అనే రసాయనం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్య తలెత్తుతుంది.
అదే విధంగా టమాటను ఎక్కువగా తీసుకుంటే.. ఎసిడిటీ పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా తేన్పులు, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
టమాటలో పొటాషియం, ఆక్సలేట్ పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అతిగా తీసుకోవద్దు.
టమాటలో అధికంగా ఉండే సోడియం కారణంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బీపీతో బాధపడే వారు టమాటను అధికంగా తీసుకోకూడదు.
ఇక టమాటను అధికంగా తీసుకుంటే అర్థరైటిస్ నొప్పులు వేధిస్తాయి. ఇందులోని హిస్టమిన్ అనే రసాయనం రోగ నిరోధక శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.
మైగ్రెయిన్ సమస్యతో బాధపడేవారు వీలైనంత వరకు టమాటకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వరకు టమాటను మితంగా తీసుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలంప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..