TV9 Telugu

18 March 2024

ఉప్పు మానేసినా ముప్పే.. 

ఉప్పును పూర్తిగా తగ్గిస్తే శరీరంలో సోడియం లోపం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది టైప్‌2 డయాబెటిస్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు.

ఉప్పును పూర్తిగా మానేస్తే తల తిరగడం, కళ్లు తిరిగినట్లై పడిపోవడం వంటి ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.

ఉప్పును తగ్గిస్తే వాంతులు సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే సరిపడ ఉప్పును కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో ఉప్పును పూర్తిగా తగ్గిస్తే తలనొప్పి వస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇది మూర్ఛకు కూడా దారి తీస్తుందని సూచిస్తున్నారు. 

ఇక కొందరిలో ఉప్పు తక్కువ తీసుకోవడం వల్ల చిరాకు, డిప్రెషన్‌లోకి వెళ్లిన భావన కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే కచ్చితంగా సరిపడ ఉప్పు తీసుకోవాలని చెబుతున్నారు.

శరీరంలో కండరాల కదలికలకు, నాడుల్లో సమాచారం అందించడానికి ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఉప్పు పూర్తిగా మానేస్తే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సమస్య ప్రకారం శరీరానికి రోజుకు 2 గ్రాముల సోడియం అవసరం. ఇది 5 గ్రాముల ఉప్పు ద్వారా లభిస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు 1 టీస్ఫూన్‌ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.