స్టైల్‌గా బెడ్‌ కాఫీ తాగుతున్నారా.? 

Narender Vaitla

12 September 2024

పళ్లు తోమకుండా కాఫీ, టీ తాగడం వల్ల నోట్లోని చెడు బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆందోళన, భయం, ఉద్రేకం ఎక్కువుతుందని అంటున్నారు.

ఇక ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగే వారిలో కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది. అల్సర్‌ వంటి సమస్యలకు ఇది కారణమయ్యే అవకాశాలు ఉంటాయి

కాఫీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్‌, కాల్షియం సహా కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో శరరం త్వరగా అనారోగ్యానికి గురవుతుంది.

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌ పేషెంట్స్‌ అస్సలు తాగకూడదు.

టీ తాగిన వెంటనే నీటిని తీసుకోవాలనిపించదు. దీంతో ఉదయం చాలా సేపు టీ తాగకుండా ఉంటారు. దీనివల్ల డీ హైడ్రేషన్‌ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.