ఎక్కువకాలం కలయికకు దూరంగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాధుల్ని ఎదుర్కొనే సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది.
దీర్ఘకాలంగా శృంగారానికి దూరంగా ఉంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కలయిక సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడి దూరం చేసి ప్రశాంతంగా ఉంచుతాయి.
ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. వెజైనా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. కాల క్రమేణా ఇది వెజైనల్ ఇన్ఫెక్షన్లకూ దారి తీస్తుందని అంటున్నారు.
ఇక ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉండే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరగడానికి కారణమవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.
శృంగారంపై ఆసక్తి పెరగాలంటే భాగస్వాములు ఏకాంతంగా గడపడం అలవాటు చేసుకోవాలి. ఇంటి పనులు, ఆఫీస్ పనులను పక్కన పెట్టి అలా బయటకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి.
లైంగిక కోరికలు పెరగాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్, అరటి పండ్లు వంటి వాటిని తీసుకోవాలి.
శృంగార జీవితానికి ఎక్కువ రోజులు దూరంగా ఉండే వారిలో నిద్రలేమి సమస్య వస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. శృంగార సమయంలో డోపామైన్ విడుదలవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకే మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.