పాలకూర అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మూత్రంలో కాల్షియం విసర్జనను ప్రోత్సహిస్తుంది.
పాలకూరను ఎక్కువగా తీసుకునే వారిలో బీపీతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో అప్పటికే ఈ సమస్యలతో బాధడుతున్న వారికి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా పాలకూర ప్రతకూల ప్రభావం చూపుతుందని ఇందులో ఆక్సాలిక్ యాసిడ్, ప్యూరిన్ కాంపౌండ్ కీళ్ల నొప్పుల సమస్యను పెంచుతుంది
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ, బ్లడ్ థిన్నర్ మందులను ఉపయోగిస్తున్న వారు పాలకూరకు దూరంగా ఉండాలి. పాలకూర వల్ల ఈ ముందుల పనితీరు దబ్బతింటుంది.
ఇక పాలకూరలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువైతే రక్తం పల్చగా మారుతుంది. ఫలితంగా అలసట, బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
పాలకూరతో లాభాలు లేవా ఉంటే కచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా హైబీపీతో బాధపడేవారు పాలకూర తీసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా పాలకూర దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.