17 July  2024

ఆలుగడ్డ తినే ముందు ఆలోచించుకోవాల్సిందే.. 

Narender.Vaitla

డయాబెటిస్‌ బారిన పడిన వారికి ఆలుగడ్డకు దూరంగా ఉండాలి. వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. వీటిని తిన్న వెంటనే గ్లూకోజ్ అధికంగా శరీరంలోకి విడుదలయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఆలుగడ్డను అధికంగా తీసుకుంటే గ్యాస్ట్రిక్‌ సమస్యలు సైతం వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపలు పొట్టలో చేరాక గ్యాస్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తాయి.

ఆలుగడ్డను ఎక్కువగా తీసుకునే వారిలో ఊబకాయం సమస్య వెంటాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలుతో చేసే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటే లావెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హైబీపీతో బాధపడేవారు కూడా ఆలుగడ్డను వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

ఎసిడిటీతో బాధపడేవారు కూడా బంగాళదుంపకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఆలు తింటే ఈ సమస్య ఎక్కువుతుంది. 

ఆలుతో లాభాలు లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇందులోని సెరటోనిన్‌, డోపమైన్‌ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లు ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి చక్కగా నిద్ర పడుతుంది.

అలాగే ఆలుగడ్డ సౌందర్య పోషణలోనూ ఉపయోగపడుతుంది. ఆలుగడ్డ జ్యూస్‌ లేదా ముక్కలతో ముఖానికి మసాజ్‌ చేస్తే నల్లమచ్చలు, ముడతలు తగ్గుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.