స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఏకంగా 12 గంటలు ఫోన్‌తోనే ఉంటున్నట్లు పలు సర్వేల్లో తేలింది.
మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా మారకపోతే ఎలా అనే ఉద్దేశంతో మొదలై స్మార్ట్ ఫోన్ వ్యసనంలా మారిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే స్మార్ట్ ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగిస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గంటల తరబడి స్మార్ట్ ఫోన్స్‌లో వీడియో గేమ్స్ ఆడే వారి కళ్లపై వీపరీతమైన దుష్ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
అదే పనిగా స్మార్ట్ ఫోన్ చూస్తే.. కండ్లు తీవ్ర అలసటకు లోనవుతాయని, దీంతో తలనొప్పి వేధిస్తుందని పేర్కొన్నారు.
అంతేకాదు స్మార్ట్ ఫోన్‌ను గంటలతరబడి చూడడం వల్ల భవిష్యత్తులో కంటి చూపు మందగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక నిత్యం సోషల్ మీడియాలో గడిపే వారు డిప్రెషన్ బారిన పడుతున్నట్లు నిపుణులు నిర్వహించిన సర్వేలో తేలింది.
భౌతిక ప్రపంచాన్ని కాకుండా వర్చువల్ వరల్డ్‌లో జీవిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని. ఇది వైవాహిక జీవితంపై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు.