అతిగా నిద్రపోతే మీ పని అంతే.. 

29 November 2023

రోజుకు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి దీర్ఘకాలంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

అతిగా నిద్రపోయే వారిలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయని చెబుతున్నారు. 

నిద్ర ఎక్కువగా పోయే వారిలో గుండె సమస్యలు వచ్చే ఛాన్సెస్‌ ఉంటుందని చెబుతున్నారు. అలాగే తలనొప్పి, వెన్ను నొప్పులకు కూడా కారణమవుతుందని అంటున్నారు. 

ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో నడుము నొప్పి సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం అలసటతో ఉంటారు. 

అతిగా నిద్రపోవడం వల్ల విపరీతమైన అలసట వేధిస్తుంది. చిన్న పని చేసినా అలసిపోతుంటారు. అంతేకాకుండా డిప్రెషన్‌ వంటి సమస్యలు వెంటాడుతాయి. 

ఈ సమస్యల బారిన పడకూడదంటే మధ్యాహ్నం పడుకోవడం మానేయాలి. ఒకవేళ ఖాళీగా ఉన్నా ఏదో ఒక పనితో బిజీగా మారాలి. 

పగటి పూట శారీరక శ్రమ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాలు వంటివి చేయాలి. ఉదయం త్వరగా లేవడానికి ప్రయత్నించాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందింనవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.