మైదాను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలకు దారీ తీస్తుందని అంటారు.
మైదాలో కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. బరువు అదుపులో ఉండాలనుకునే వారు మైదాకు దూరంగా ఉండాలి.
మైదాను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మైదాను తక్కువగా తీసుకోవాలి.
డయాబెటిస్ పేషెంట్స్ మైదాకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర పరిమాణాలను ఎంతో సులభంగా పెంచుతుంది.
మైదాతో చేసిన ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దీంతో ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మైదాను ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.
మైదాను ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. చికాకు వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.