బిర్యానీలో నిమ్మకాయ పిండుకుంటున్నారా.? 

23 December 2023

నిమ్మకాయ విటమిన్‌ సీకి పెట్టింది పేరు. నిమ్మకాయను క్రమంతప్పకుండా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతుంటారు. 

అయితే నిమ్మకాయను సరైన విధానంలో తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

పాల ఉత్పత్తుల్లో నిమ్మరసాన్ని కలిపి తీసుకోకూడదని, ఇలా తీసుకుంటే గుండెల్లో మంటగా అనిపించడం, వాంతులు అవడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. 

బిర్యానీ వంటి మసాలా వంటకాల్లో నిమ్మరసాన్ని పిండుకోవడం సర్వసాధారణం. అయితే దీనివల్ల ఎసిడిటీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

రెడ్‌ వైన్‌ తీసుకునే సమయంలో కూడా నిమ్మకాయను ఏ రూపంలో తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం వైన్‌ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. 

నిమ్మకాయ రసం ఎక్కువగా తీసుకుంటే కడుపులో ఆమ్లస్రావం పెరుగుతుంది. దీంతో ఎసిడిటీ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే.. దంతాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాసిడ్స్‌ దంతాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.