21 June 2024

ఈ గింజలు మంచివే.. కానీ  ఎక్కువ తింటే మాత్రం 

Narender.Vaitla

అలెర్జీలతో బాధపడేవారు అవిసె గింజలకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో చర్మంపై దద్దుర్లు, ఎరుపు, వాపు, దురద వంటి సమస్యలకు దారి తీస్తుంది.

గర్భిణీలు అవిసె గింజలను తీసుకోకూడదుని నిపుణులు చెబుతున్నారు. ఇవి హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. కాబట్టి గర్భదారణ సమయంలో తీసుకోకపోడమే మంచిది.

అవిసె గింజలను అధికంగా తీసుకోవడం కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. అధికంగా తీసుకుంటే కడుపు నొప్పికి కారణమవుతుంది.

అవిసె గింజల్లో ఫైబర్‌ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనివల్ల గ్యాస్‌, కడుపు నొప్పి, అపానవాయువు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక కొందరిలో అవిసె గింజలు మలబద్ధకానికి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అవిసె గింజలను అధికంగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు.

అవిసె గింజలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తస్రావం ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మహిళలు పీరియడ్స్‌ సమయంలో వీటికి దూరంగా ఉండడమే మంచిది.

వైద్యుల సూచన ప్రకారం.. ప్రతిరోజూ కేవలం 1 టీస్పూన్ (7 గ్రాములు) అవిసె గింజలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అంతకు మించి తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.