నెయ్యి ఎక్కువగా తింటున్నారా.? జాగ్రత్త.. 

Narender Vaitla

15 November 2024

లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు నెయ్యిని మితంగా తీసుకోవడమే మంచిది. ముఖ్యంగా లివర్ సిరోసిస్, హెపటో మొగలీ, హైటైటిస్ రోగులు నెయ్యిని పూర్తిగా మానేయాలి.

షుగర్‌ పేషెంట్స్‌ కూడా నెయ్యిని మితంగా తీసుకోవాలి. నెయ్యిలో ఉంటే కొవ్వుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదముంది.

అధిక బరువుతో బాధపడేవారు నెయ్యిని మితంగా తీసుకోవడమే మంచిది. నెయ్యిలో ఉండే శాచురేటెడ్ కొవ్వులు హై కొలెస్ట్రాల్ లెవల్ పెంచే అవకాశం ఉంటుంది.

అజీర్తి, వికారం, గ్యాస్‌ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా నెయ్యిని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా నెయ్యికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై మంట, దద్దుర్లు, వాపు వంటి సమస్యలకు దారి తీస్తుంది.

గర్భిణీలు కూడా నెయ్యిని మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. నెయ్యిలో ఉండే రెటినాల్ టాక్సిసిటీ కారణంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఆరోగ్యంపై ప్రభావం పడచ్చు

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.