జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సాలిసైలేట్లు అనే సహజ రసాయనాలు జీర్ణ సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు.
పైల్స్ సమస్యతో బాధపడేవారు కూడా వంకాయను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మొలలతో ఉన్న వారు వంకాయ తింటే సమస్య మరింత ఎక్కువుతుందని హెచ్చరిస్తున్నారు.
వంకాయలో ఆక్సలేట్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారి ఎముకల సంబంధిత సమస్యలు వస్తాయి.
ఇక వంకాయలోని ఆక్సలేట్
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అధిక ఆక్సలేట్ ఆహారం తినే వ్యక్తులలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
రుమటాయిడ్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి వంకాయ తింటే సమస్య మరింత ఎక్కువుతుంది.
ఫుడ్ అలర్జీ, స్కిన్ అలర్జీతో బాధపడేవారు వంకాయ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. అలెర్జీ ఉన్న వ్యక్తులు వంకాయ తినడం వల్ల అలెర్జీ ప్రతిచర్యలు ఎక్కువగా ఉన్నాయి.
కళ్లలో మంట, వాపు, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలున్న వారు వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.