ఎముకల సంబంధిత సమస్యలు ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వంకాయలో ఉండే ఆక్సలేట్ కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
రుమటాయిడ్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండడమే మంచిది.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వంకాయను తక్కువగా తీసుకోవాలి. వంకాయ గింజలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
పైల్స్ సమస్యలతో బాధపడే వారు కూడా వంకాయను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పైల్స్ ఉన్న వారు వంకాయ తింటే సమస్య మరింత ఎక్కువుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని అంటున్నారు. వంకాయ కారణంగా గ్యాస్ సమస్యలకు దారి తీస్తాయని చెబుతున్నారు.
స్కిన్ అలర్జీతో బాధపడే వారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని అంటున్నారు. ఫుడ్ అలర్జీ ఉన్న వారు వంకాయను తీసుకోవడం వల్ల అలర్జీ సమస్య మరింత ఎక్కువవుతుంది.
కళ్లలో మంట, వాపు, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.