కలబంద మంచిదే.. ఎక్కువైతే ఈ వ్యాధులు వచ్చే అవకాశం 

02 March 2024

TV9 Telugu

Pic credit - Pexels

ఎడారి మొక్క అయిన కలబంద లో అనేక ఔషధ గుణాలున్నాయి. అమినో యాసిడ్స్, బి1, బి2, బి6, విటమిన్ సి వంటి పోషకాలు కలబందలో ఉంటాయి. 

ఔషధ లక్షణాలు

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు కలబందలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకి ఇలా అనేక రకాల మేలు చేస్తాయి

కలబంద  ప్రయోజనాలు  

ఏదైనా మితిమీరితే ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కనుక కలబందను పరిమిత పరిమాణంలో ఉపయోగించడం ద్వారా మాత్రమే తగిన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

అతిగా వాడితే 

కలబందను ఎక్కువగా ఉపయోగిస్తే.. శరీరంలో పొటాషియం లోపానికి కారణమవుతుంది. తద్వారా వేగవంతమైన హృదయ స్పందన రేటుని పెంచి గుండెకు ప్రమాదాన్ని  కలిగిస్తుంది. 

పొటాషియం లోపం

కలబందను ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. కనుక పరిమిత పరిమాణంలో మాత్రమే వాడండి.

మూత్రపిండాల సమస్య

అలోవెరా జెల్‌ను స్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతున్నారు. అయితే చర్మానికి కలబంద ఎక్కువగా అప్లై చేయడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు ఏర్పడతాయి. 

చర్మానికి నష్టం

గర్భిణీ స్త్రీలకు హాని కలిగించే కొన్ని లక్షణాలు కలబందలో ఉన్నాయి. అలోవేరా ను ఉపయోగిస్తే గర్భిణీ గర్భాశయం సంకోచించే అవకాశం ఉంది. గర్భస్రావం కావొచ్చు లేదా   ప్రసవంలో సమస్యలను కలిగించవచ్చు

గర్భిణీ స్త్రీ