సరైన నిద్ర లేకపోతే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలివే.. 

14 August 2023

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహారం తీసుకోవడమే కాక సరైన నిద్ర కూడా అవసరమే. ఈ క్రమంలో కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి.

లేదంటే నిద్రలేమి సమస్యగా మారి ఆరోగ్యంపై మరింతగా చెడు ప్రభాబాలను చూపిస్తుంది. అవేమిటంటే..

సరిగ్గా నిద్ర లేకపోతే ఏకాగ్రతపై ప్రభావం పడుతుంది. మతిమరుపు సమస్యతో అన్ని విషయాలను తేలికగా మర్చిపోతుంటారు.

కనీసం 7 గంటల నిద్ర లేకపోతే జీర్ణవ్యవస్థపై కూడా దుష్పభావం పడుతుంది. ఫలితంగా అజీర్తి,మలబద్దకం వంటి సమస్యలు ఎదురవుతాయి.

నిద్రలేమి సమస్య కారణంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. నిద్ర లేకపోవడం వల్ల హారోన్ల బ్యాలెన్స్ లోపించి, బరువు, ఊభకాయం ఏర్పడుతుంది.

రాత్రి వేళ నిద్రించకపోతే రోజంతా నిద్ర మత్తులో ఉంటారు. అలాగే మూడ్ స్వింగ్స్, చిరాకు, ఒత్తిడి సమస్యలతో ఇబ్బందిపడతారు.

ముఖ్యంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అలాగే డల్ స్కిన్, ముడతల చర్మం వంటి సమస్యల బారిన పడతారు.

ఈ క్రమంలోనే డిప్రెషన్, రోగనిరోధక వ్యవస్థ సమస్యలు, రక్తపోటు, డయాబెటీస్, గుండెపోటు సమస్యల ప్రమాదం పెరుగుతుంది.