నువ్వులను వీళ్లు తినకూడదు..ఈ సమస్యలు తప్పవు!

Jyothi Gadda

21 January 2025

TV9 Telugu

చలికాలంలో నువ్వులు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిలో ఐరన్‌తో పాటు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

TV9 Telugu

నువ్వుల్లో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వు,  సంతృప్త కొవ్వులు మెండుగా ఉంటాయి. అలాగే నువ్వులు కాల్షియం, ఐరనో లోపాన్నికూడా తీరుస్తాయి.దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

TV9 Telugu

నువ్వులను ఎక్కువగా తింటే కఫం, పిత్తం అసమతుల్యమవుతాయి. వీటిని రోజూ ఎక్కువగా తింటే పీరియడ్స్ లో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. దీంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది.

TV9 Telugu

నువ్వులకు వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి.. గర్భిణులు నువ్వులు ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, వేడిశరీర తత్త్వం కలిగినవారు కూడా.

TV9 Telugu

చలికాలంలో నువ్వు లడ్డూలను బాగా తింటుంటారు. కానీ వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా తినొద్దంటారు. 

TV9 Telugu

నువ్వులని ఎక్కువగా తింటే థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపిస్తాయి. దీంతో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి.

TV9 Telugu

నువ్వులకు అలెర్జీ చాలా మందికి ఉంటుంది. అందుకే వీటిని ఫస్ట్ టైం తింటున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అలెర్జీ శరీరమంతా వస్తుంది. 

TV9 Telugu

నువ్వులు జీర్ణ సమస్యలకు కూడా కారణమవుతాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే సంతృప్త కొవ్వు కడుపు ఉబ్బరం, మలబంధం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.