తలనొప్పిగా అనిపించినా, నిద్ర వస్తున్నట్లు అనిపించినా వెంటనే టీ తాగుతుంటారు. టీ లేనిదే రోజు గడవని వారు మనలో చాలా మంది ఉంటారు.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో టీని తయారు చేసుకొని పదే పదే తాగుతుంటారు. మళ్లీ మళ్లీ టీని వేడి చేసుకొని తాగుతుంటారు. అయితే ఇది మంచిది కాదని తెలుసా.?
టీని పదే పదే వేడి చేసుకొని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల టీలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరుగుతాయని చెబుతున్నారు.
పదే పదే టీని వేడి చేయడం వల్ల టీ రుచి కోల్పోవడమే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి టీని తీసుకోవడం వల్ల అతిసారం, కడుపు ఉబ్బరం, వికారం వంటి సస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
4 గంటలకు మించి ఎక్కువసేపు ఉన్న టీని ఎట్టి పరిస్థితుల్లో వేడి చేసుకొని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి ఉంటుంది.
దుకాణాల్లో ఎప్పుడో ఉదయం చేసిన టీని సాయంత్రం వరకు మరిగిస్తూనే ఉంటారు. ఇలాంటి టీకి వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది. ఫ్రెష్‌గా చేసుకున్న టీని తాగడమే ఉత్తమం.
ఇక టీని పదే పదే వేడి చేయడం వల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా, అందులోని పోషక విలువలు కూడా తగ్గుతాయి.