నెల రోజులు ఉప్పు తినకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే 

07 January 2024

TV9 Telugu

ఆరోగ్య పరంగా ఉప్పు చాలా ముఖ్యం. ఇందులో ఉండే అతి ముఖ్యమైన మూలకం సోడియం. దీని లోపం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి.

ఉప్పు అవసరం

సోడియం శరీరంలో నీటి స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. అంతేకాదు శరీరంలోని ఇతర భాగాలకు పోషకాలను, ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి కూడా ఇది పనిచేస్తుంది.

ఆక్సిజన్ అందిస్తుంది 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉప్పు కూడా సరైన మోతాదులోనే తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం సరికాదు.. అంతేకాదు పూర్తిగా మానెయ్యడం కూడా సరికాదు.

సమతుల్యం 

ఎవరైనా సరే ఒక నెల రోజుల పాటు ఉప్పు తీసుకోకపోతే బీపీ పూర్తిగా తగ్గిపోతుంది. అదే సమయంలో శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతింటుంది

నెల రోజుల పాటు

నెల రోజులుగా ఉప్పు తినకపోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీంతో వాంతులు, వికారం, మైకము, అతిసారం, నీరసం, అలసట వంటివి బాధించవచ్చు.

వాంతులు అయ్యే అవకాశం  

శరీరంలో సోడియం తక్కువ అయితే ఎముకలు బలహీనపడతాయి. ఎముకలు బలహీనపడటం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

బలహీనమైన ఎముకలు

ఉప్పు ఎక్కువగా తిన్నా సరే శరీరం వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, వాపు, తలనొప్పి , డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.

ఎక్కువగా తింటే