పచ్చి బఠానీలు తింటున్నారా.? ఓసారి ఆలోచించుకోండి.. 

Narender Vaitla

05 December 2024

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బఠానీలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు బఠానీని మితంగా తీసుకోవాలి.

పచ్చి బఠానీల్లో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతాయి. దీని వల్ల కిడ్నీలో రాళ్లు, కీళ్లనొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

పచ్చి బఠానీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. శరీరానికి అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా లభిస్తాయి. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది.

ఏదైన వ్యాధికి ట్రీట్‌మెంట్లో భాగంగా మెడిసిన్స్‌ వాడుతున్న వారు కూడా బఠానీలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

యూరిక్‌ యాసిడ్ సమస్య ఉన్న వారు కూడా పచ్చి బఠాణీకి దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది.

అన్నీ నష్టాలేనా లాభాలు లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పచ్చి బఠానీలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

పచ్చి బఠానీల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.