టమాటాలు అతిగా తింటున్నారా..ఈ వ్యాధులు తప్పవు..తస్మాత్‌ జాగ్రత్త..!

26 November 2023

టమాటాల్లో విటమిన్ -సి, ఫైబర్ , కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

టమాటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

టమాటాలను అతిగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మూత్రపిండాల్లో రాళ్లు సమస్యతో బాధపడేవారు టమాటాలను అతిగా తినకూడదు. టమాటాల్లో ఉండే అధిక పొటాషియం సమస్యను మరింత పెంచుతుంది. 

టమాటాలను అధికంగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణక్రియ సమస్యలు, అలెర్జీలు మరియు అనేక ఇతర సమస్యలు వస్తాయి. 

గ్యాస్, ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు టమాటాలను ఎక్కువగా తింటే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి.

టమాటాల్లో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా డయేరియా సమస్యలకు దారితీస్తుంది. అందుకే టమాటాలను తక్కువ మోతాదులో తీసుకోవటం ఉత్తమం.

కొంతమందికి టమాటాలు తినడం వల్ల నోరు, నాలుక, ముఖంలో వాపు వంటి అలర్జీలు వస్తాయి. అలాగే  గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా వస్తాయి.