లవంగాలు ఎక్కువగా తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

Jyothi Gadda

18 January 2025

TV9 Telugu

వంగాల వినియోగం అనేక విధాలుగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే లవంగాలు అతిగా తినే వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. 

TV9 Telugu

లవంగాల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నా.. వాటిని ఎక్కువగా తింటే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. 

TV9 Telugu

లవంగాల్లో యూజినాల్ అనే రసాయనం ఉంటుంది. దీనిని పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డైటీషియన్లు చెబుతున్నారు. 

TV9 Telugu

తలనొప్పి, కళ్లు తిరగడం, బలహీనత లాంటివి వస్తాయి. మీకు ఇప్పటికే ఈ సమస్యలుంటే లవంగాలు తినడం మానుకోవాలి. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

TV9 Telugu

హిమోఫిలియా వంటి రక్తస్రావం రుగ్మతల విషయంలో, లవంగం తీసుకోవడం బాధిస్తుంది. లవంగాలు సన్నబడే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దెబ్బ తగిలితే ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.

TV9 Telugu

గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు లవంగాన్ని ఎక్కువగా తినకూడదు. లవంగాలను ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

TV9 Telugu

లవంగాలను అతిగా వాడటం వల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. వాటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి.   

TV9 Telugu

లవంగాలు తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. ఇప్పటికే గ్లూకోజ్ తక్కువగా ఉన్నవారు లవంగాలను తినకపోవడమే మంచిది.

TV9 Telugu