మీరూ చాక్లెట్లు అధికంగా తింటున్నారా?

25 July 2024

TV9 Telugu

TV9 Telugu

నోట్లో వేసుకోగానే.. కమ్మగా, మెత్తగా జారిపోయే చాక్లెట్‌ను ఇష్టపడనివారు దాదాపు ఉండరు. అందుకే చిన్నవారైనా, పెద్దవారైనా వయసుతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరూ చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు

TV9 Telugu

అయితే ఇష్టం కదా అని అత్యాశతో అధికంగా చాక్లెట్ తింటే మాత్రం చిక్కులు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు అధికంగా చాక్లెట్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

TV9 Telugu

నిజానికి, చాక్లెట్ ఆరోగ్యానికి అంత హానికరం కాదు. కానీ మీరు ప్రతిరోజూ చాక్లెట్ ఎక్కువగా తింటే మాత్రం ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

TV9 Telugu

చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. ఇందులో పాలు, చక్కెర, వెన్న ఉంటాయి. ఇవి చర్మంపై మొటిమలను కలిగిస్తాయి

TV9 Telugu

చాక్లెట్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చాక్లెట్‌ను ఎక్కువగా తీసుకోకూడదు

TV9 Telugu

చాక్లెట్‌లో కోకో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పదార్ధం అధిక మొత్తంలో శరీరంలో పెరిగినప్పుడు, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దీంతో రక్తపోటు కూడా పెరుగుతుంది

TV9 Telugu

చాక్లెట్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు

TV9 Telugu

డార్క్ చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల కూడా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శరీరం నుంచి అధిక మొత్తంలో నీరు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది