అరటి పండుతో ఆరోగ్యమే కాదు ఈ సమస్యలున్నవారు తింటే ప్రమాదం 

10 July 2024

TV9 Telugu

Pic credit - pexels

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి ఎన్నో రకాల పోషకాలున్నాయి. తక్కువ ధరకే దొరికే ఇది పేదవారికి ప్రకృతి ప్రసాదం.  

పోషకాలు మెండు 

అరటి పండులో ఎక్కువ పొటాషియం ఉంది. కనుక కిడ్నీ సమస్యలు ఉన్నవారికి అరటి పండ్లు ఎక్కువగా తింటే సమస్య కావచ్చు. అధిక పొటాషియం రక్తంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది.  ఇది ప్రమాదకరమైనది. 

కిడ్నీ సమస్యలు

అరటిపండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచుకోవాలి కనుక అరటి పండుని ఎక్కువుగా తింటే రక్తంలో షుగర్ లెవెల్ పెరుగుతుంది.

మధుమేహం

కొంతమంది అపానవాయువు, మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు. ఈ సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లకు దూరంగా ఉండాలి. 

మలబద్ధకం

అరటి పండ్లలో ఫైబర్ కొందరికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలతో పాటు అతిసారం వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. 

జీర్ణ సమస్యలు 

కొంతమంది అలెర్జీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దురద, దద్దులు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అరటి పండుకు దూరంగా ఉండాలి.  

అలెర్జీ

ఈ సీజన్ లో చాలా మంది ఆస్తమాతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు అరటిపండు తినకూడదు. లేదంటే శ్వాస తీసుకోవడంలో సమస్య మరింత పెరుగుతుంది. గురక పెట్టేవారు కూడా అరటిపండుని తినొద్దు 

ఆస్తమా,గురక సమస్య 

అరటి పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎవరైనా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే అరటి పండుని తక్కువగా తీసుకోవాలి. 

బరుగు తగ్గాలనుకుంటే 

అరటిపండ్లను ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అరటిపండులో పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.అసిడిటీ బారిన పడే అవకాశం ఉంది. 

 అసిడిటీ