ఆలూ ఇష్టమని తెగ తినేస్తున్నారా ఈ సమస్యలున్నవారు జాగ్రత్త సుమా.. 

15 October 2024

TV9 Telugu

Pic credit - Getty

పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా బంగాళదుంపలతో చేసిన వంటకాలు అంటే చాలా ఇష్టం. బంగాళదుంప వేపుడు,  కూర, పలావ్, బజ్జీలు ఇలా ఎన్నో రకాల ఆహారాన్ని ఇష్టంగా తింటారు. 

ఇష్టమైన ఆలూ 

అయితే ఈ బంగాళా దుంప అంటే ఇష్టం ఉన్నా సరే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తినొద్దు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాం..

ఈ సమస్యలుంటే తినొద్దు 

బంగాళా దుంపల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అధికం. వీటిని తినడం వలన శరీరంలోకి ఎక్కువగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. కనుక షుగర్ పేషెంట్స్ బంగాళదుంపలను తినొద్దు.  

షుగర్ పేషెంట్స్

గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు బంగాళాదుంపలతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. వీటిని తింటే గ్యాస్టిక్ సమస్య మరింత పెరుగుతుంది. 

గ్యాస్ట్రిక్ సమస్యలు

అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడే వారు బంగాళాదుంపలతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. వీటిని తింటే మరింతగా బరువు పెరుగుతారు. 

ఊబకాయ సమస్య ఉంటే 

బరువు తగ్గాలనుకుంటే బంగాళదుంపలతో చేసిన ఆహారం తింటే మరింతగా బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకున్న వారు కూడా వీటికి దూరంగా ఉండడం మంచిది. .

బరువు తగ్గాలంటే 

హై బీపీతో బాధపడుతున్న వారు బంగాళదుంపలకు దూరంగా ఉంటే మంచిది. బంగాళా దుంపలను అధికంగా తింటే అధిక రక్తపోటు సమస్య మరింత అధికమవుతుంది. 

అధిక రక్త పోటు 

బంగాళాదుంపలను రాత్రి భోజనంలో తినకూడదు. ఇది ఎసిడిటీ సమస్య మరింత పెరుగుతుంది. కడుపుబ్బరం కూడా రావచ్చు. పిల్లలకు కూడా రాత్రిపూట ఆలూ గడ్డ వంటకాలు పెట్టకపోవడం అన్ని విధాలా మేలు.

ఎసిడిటీ సమస్య

కొంతమందికి బంగాళదుంపల వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. వారంలో మూడు సార్లు కంటే ఎక్కువగా తింటే ఈ అలర్జీలు కనిపిస్తాయి. 

అలెర్జీ