మంచిదని బొప్పాయి పండు అతిగా తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

Jyothi Gadda

1 September 2024

ప్రతి రోజు బొప్పాయి పండు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులోని గింజలను ఔషధ మూలికలుగా వినియోగిస్తారు. ఇందులో పోషకాలతో పాటు ఖనిజాలు కూడా లభిస్తాయి.

కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే చాలా మంది ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయని అతిగా తింటూ ఉంటారు. 

నిజానికి ఇలా అతిగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.    

ఖాళీ కడుపుతో బొప్పాయిని అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే గుణాలు అజీర్ణం, గ్యాస్, అతిసారం వంటి సమస్యలకు దారి తీస్తాయి. 

బొప్పాయి పండు అతిగా తినడం వల్ల అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మంపై దురద, ఉబ్బరం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందే కలిగిస్తుంది.

బొప్పాయి అతిగా తినడం వల్ల ఔషధాలు తీసుకునేవారికి అనేక సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని అతిగా తినకపోవడం చాలా మంచిది. 

బొప్పాయిలో ఉండే లాటెక్స్ అనే పదార్థం రక్తం గడ్డకట్టడం ప్రక్రియను మందగిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తీసుకోవడం అంత మంచిది కాదు.

అధ్యయనాల ప్రకారం.. గర్భవతిగా ఉన్న మహిళలు బొప్పాయిని అధికంగా తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, వీరు బొప్పాయిని తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

మంచిదని బొప్పాయి పండు అతిగా తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

Jyothi Gadda

1 September 2024