రాత్రిపూట పెరుగు తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా..

26 September 2024

TV9 Telugu

TV9 Telugu

కాలం ఏదైనా పెరుగు తింటే చలవే చేస్తుంది. జలుబు చేస్తుందనో, లావైపోతామనో పెరుగుని పూర్తిగా దూరం పెడతారు కొందరు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే వారి జీవితకాలం పెరిగుతుందట

TV9 Telugu

పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి  మలబద్ధకాన్ని అదుపులోకి తెస్తాయి

TV9 Telugu

పెరుగు రోజూ తీసుకుంటే ఇందులోని ప్రోబయోటిక్స్‌ మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను తగ్గించి, రక్త సరఫరాను సమన్వయం చేస్తాయి

TV9 Telugu

శరీరాకృతిని చక్కగా ఉంచేందుకు వ్యాయామాలు చేసేవారు పెరుగు రోజూ తీసుకోండి. దీనిలో ఉండే ప్రోటీన్లు మంచి ఫలితాన్నిస్తాయి

TV9 Telugu

పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతున్నప్పటికీ  రాత్రిపూట పెరుగు తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

పెరుగులో ఉండే టైరమైన్ కంటెంట్ నిద్రకు భంగం కలిగిస్తుందట. నిద్ర సరిగ్గా పట్టదట. దీంతో నిద్రలేమి సంభవించి అనేక సమస్యలు పుట్టుకొస్తాయి

TV9 Telugu

రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఊబకాయం, దగ్గు, జలుబు సమస్యలు వస్తాయి. అధిక కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులతో బాధపడేవారు పెరుగుకు దూరంగా ఉండాలి

TV9 Telugu

జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు. అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా రాత్రిపూట పెరుగు తినకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు