బీర్‌ ఏం కాదు మామా.. అనుకుంటున్నారా.? 

Narender Vaitla

29 November 2024

బీర్‌ ఎక్కువగా తాగడం వల్ల లివర్‌ ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లివర్‌ చుట్టూ కొవ్వు పేరుకోవడం, కాలేయ వాపు వంటి వ్యాధులకు దారి తీస్తుందని అంటున్నారు.

బీర్‌ తాగడం వల్ల బరువు పెరుగుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బీరు తాగిన వారు తెలియకుండానే ఎక్కువగా ఆహారం తీసుకుంటారని ఈ కారణంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు.

సాధారణంగా బీర్‌ తాగితే మెరుగైన నిద్ర ఉంటుందని అంతా భావిస్తారు. కానీ ముందు నిద్రపట్టినట్లు అనిపించినా నాణ్యమైన తీవ్ర దూరమవుతుందని అంటున్నారు.

బీరు ఎక్కువగా తాగితే గుండె జబ్బులు వెంటాడుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. రెగ్యులర్‌గా బీర్‌ తాగే వారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

క్యాన్సర్‌ అతిగా తాగే వారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెద్దపేగు, లివర్‌, అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి.

రోజూ బీర్ తాగే వారిలో రక్తపోటు పెరిగే అవకాశం కూడా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నారు. అధిక రక్తపోటును బీర్‌ ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, నాణ్యతపై కూడా బీర్‌ ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువగా బీర్‌ తాగితే శుక్ర కణాల నాణ్యత దెబ్బ తింటుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.