యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. అన్నం తినవచ్చా?

29 February 2024

TV9 Telugu

Pic credit - Pexels

ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది స్ఫటికాల రూపంలో కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. గౌట్ సమస్యను పెంచుతుంది.

కీళ్లలో తీవ్రమైన నొప్పి

బఠానీలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, పప్పులు, బీన్స్, బెండకాయలు, పుట్టగొడుగులు వంటివి శరీరంలో ప్యూరిన్ మొత్తాన్ని పెంచుతాయి. దీంతో యూరిక్ యాసిడ్‌ స్థాయిని పెంచుతాయి. 

యూరిక్ యాసిడ్ పెరిగితే 

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు అన్నం తినాలా వద్దా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఈ నేపధ్యంలో పోషకాహార నిపుణులు ఏమి చెప్తున్నారో తెలుసుకుందాం.. 

అన్నం తింటే మంచిదేనా?

అన్నంలో ప్యూరిన్ కనిపించకపోయినా.. ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రాత్రి వేళ అన్నం తినకూడదని వైద్యుడు దీపక్ సుమన్ చెబుతున్నారు.

రాత్రి వేళ అన్నం 

బియ్యంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్ధాలు ఉన్నాయి. దీని వలన జీవక్రియ మందగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల యూరిక్ యాసిడ్ రోగులు ఇబ్బందులు పడతారు. 

ఇబ్బందిని కలిగించే కార్బోహైడ్రేట్లు 

అన్నంతో పాటు తినే ఆహారంలో పప్పులను తీసుకుంటే.. అధిక ప్రోటీన్ కంటెంట్ కారణంగా పప్పులు శరీరంలో ప్యూరిన్ ను పెంచుతాయి. దీంతో యూరిక్ యాసిడ్ సమస్యను పెంచుతుంది.

హాని కలిగించే పప్పులు 

అయితే అన్నం తినే అలవాటు ఉన్నవారు రోజులో కొంచెం తినే ఆహారంలో కొద్ది మొత్తంలో అన్నం చేర్చుకోవచ్చు. బియ్యాన్ని నీటిలో ఉడకబెట్టి.. గెంజిని తొలగించిన తర్వాత మాత్రమే తినాలి. 

ఏ సమయంలో తినాలంటే