చలికాలం నువ్వులు తింటే.. 

Narender Vaitla

09 November 2024

రోజూ ఒక స్పూన్‌ నువ్వులు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చలికాలంలో వచ్చే గుండె సమస్యలు తగ్గుతాయి.  

డయాబెటిస్‌తో బాధపడేవారికి చలికాలంలో ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వులు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు.

ఇక చలికాలం కొందరిలో మల బద్ధకం సైతం వేధిస్తుంటుంది. అలాంటి వారు రెగ్యులర్‌గా నువ్వులను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుందని నిపుణులు అంటున్నారు. 

అలాగే వింటర్‌లో ఎముకలు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం , జింక్ ఎముకలను బలంగా ఉంచుతాయి. అంతేకాదు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  

చలికాలం సహజంగానే ఎక్కువగా తింటుంటాం. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే నువ్వులు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా నువ్వులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా నువ్వుల నూనెను చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

రక్తపోటు సమస్యను తగ్గించడంలో కూడా నువ్వులు ఉపయోగపడతాయి. ఇందులోని ట్రై గ్లిసెరైడ్స్‌ అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.