తలనొప్పి వస్తే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.? అయితే జాగ్రత్త..!
24 August 2023
నేటి కాలంలో చాలా మంది ప్రతి సమస్యకు మెడిసిన్స్ వాడుతుంటారు. కొంచె సమస్య వస్తే చాలు వెంటనే మెడిసిన్స్ వేసుకుంటారు.
ఈ మధ్యకాలంలో మెడిసిన్ వాడకం చిన్నపాటి సమస్య వచ్చినా వాడుతున్నారు. ఇలాంటి వాటిలో తలనొప్పి ఒకటని చెప్పొచ్చు.
తలనొప్పి విషయంలో ఈ పరిస్థితి అధికంగా ఉంటుంది. చాలా మంది తలనొప్పి రాగానే వెంటనే మందులు వేసుకుంటారు.
తలనొప్పి సమస్య తరచుగా వచ్చి.. ఔషధం సహాయంతో నియంత్రణ చేసుకుంటే చెడు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నిరంతరంగా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ఇది శరీరంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుండి కిడ్నీ వరకు సమస్యలను కలిగిస్తుంది.
నిరంతరం మందులు వాడడం వల్ల తలలో ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటే.. కూడా సకాలంలో గుర్తించడం సాధ్యం అవదు.
తలనొప్పికి 100 కంటే ఎక్కువ కారణాలు అని ఆరోగ్య నిపుణుల చెబుతారు. మెదడులో అనేక రకాల తీవ్రమైన వ్యాధుల కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది.
ఎవరికైనా తలనొప్పి ఇలాగే కొనసాగితే.. అది బ్రెయిన్ ట్యూమర్, ఇతర సమస్యల లక్షణం కూడా కావొచ్చు. అలాంటి పరిస్థితిలో ఔషధాలను తీసుకోకుండా ఉండాలి.