TV9 Telugu

ఇక పాత రేట్లకే రైల్వేలో సెకండ్‌ క్లాస్‌, ఆర్డినరీ ఛార్జీలు

29 Febraury 2024

దేశవ్యాప్తంగా కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత రైల్వే మెల్లగా ప్యాసింజర్‌ ట్రైన్ల పేర్లను మార్చడం మొదలుపెట్టింది.

వాటి కొత్త పేర్ల ఆధారంగా రైల్వేశాఖ ఛార్జీలు వసూలుచేస్తుండటంతో ఆర్డినరీ ఛార్జీలు పూర్తిగా అదృశ్యమయ్యాయి.

దీంతో కనీస టికెట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సమానంగా ధర రూ.10 నుంచి రూ.30కు చేరడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దింతో సోమవారం రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకొంది.

తాజాగా సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ రైళ్ల కనీస టికెట్‌ ధరను పాత రేట్లులానే వసూలు చేయాలని బుకింగ్‌ రిజర్వేషన్‌ అధికారులకు సమాచారం అందింది.

మెయిన్‌లైన్‌ ఎంఈఎంయూలో ఆర్డినరీ క్లాస్‌ టికెట్‌ ధరలు 50 శాతం వరకు తగ్గాయి. సాధారణంగా ఈ రైలు నంబర్లు సున్నాతో మొదలవుతుంటాయి.

అన్‌ రిజర్వ్‌డ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌లోను వీటి ధరలు అప్‌డేట్‌ చేశారు రైల్వే శాఖ అధికారులు. దీంతో ప్రయాణికులకు ఊరట లభించింది.

గతంలో ప్యాసింజర్‌ రైళ్లుగా సేవలందించి ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌గా మారిన అన్నింటికీ ఈ మార్పు వర్తిస్తుంది.

జూన్‌ 2022లో నైరుతీ రైల్వే మొత్తం 8 ప్యాసింజర్‌ స్పెషల్స్‌ను అన్‌ రిజర్వ్ డ్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. 2021 ఏప్రిల్‌లో ఇదే మొత్తం 20 రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా చేర్చింది.