లీచీ ఫ్రూట్ తింటున్నారా ?? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

TV9 Telugu

05 June 2024

తాజాగా వేసవిలో వస్తన్న లిచీ ఫ్రూట్స్ బాగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇది వాటర్ కంటెంట్ కలిగి ఉంది తినటానికి తియ్యగా ఉంటుంది.

ఈ లిచీ ఫ్రూట్స్ తినటానికి తియ్యగా ఉంటుందని ఎక్కువగా తింటుంటారు. కానీ అలా ఎక్కువ తినకూడదు అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు.

ఈ సందర్భంగా పోషకాహార నిపుణుడు రంజన్ దాస్ మాట్లాడుతూ ఎన్ని లీచీలు తినాలి.. వాటివల్ల కలిగే లాభాలు, నష్టాలను తెలియచేసారు.

లిచీ ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు లిచీని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అధిక బరువు ఉన్నారు లిచీ ఎక్కువ తీసుకోకూడదు. 100 గ్రాముల లిచీలో 66 కేలరీలు ఉంటాయి, కాబట్టి ఎక్కువ లిచీ తినడం వల్ల బరువు పెరుగుతారు.

అలాగే, చాలా మంది లీచీని తిన్న తర్వాత అలెర్జీ సమస్యలను ఎదుర్కొంటారు. ఇది వివిధ సమస్యలను కలిగిస్తుంది.

రోజుకు 10 నుంచి 12 లీచీలకు మించి తినకూడదన్నారు. కాబట్టి లిచ్చి తినే ముందు, ఈ కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి  తరువాత లిచీని తినండి.