ఎదుటివాళ్ల మైండ్‌ని మన కంట్రోల్‌లో ఉంచే డ్రగ్స్‌.. యమ డేంజర్‌!

May 14, 2024

TV9 Telugu

TV9 Telugu

డ్రగ్స్‌.. తనకు బానిసలను చేసుకుని మెల్లమెల్లగా ప్రాణాలను హరించే యమపాశం. అందుకే ఆ వ్యసనం నుంచి బయపడేసేందుకు నానాయాతన పడుతుంటారు సంబంధికులు

TV9 Telugu

వీటిని వాడిన వారు వొళ్లు తెలియకుండా మత్తులో విహరిస్తుంటారు. కానీ ఈ కొత్త రకం డ్రగ్‌ మాత్రం ఏకంగా అవతలి వాళ్ల మైండ్‌ని కంట్రోల్‌ చేస్తుందట

TV9 Telugu

కొందరు దుండగలు ఈ డ్రగ్‌తో అమాయక ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. అంటే ఈ డ్రగ్ అవతల వాళ్ల మైండ్‌ని కంట్రోల్‌ చేస్తుందన్నమాట

TV9 Telugu

ఆ డ్రగ్‌ పేరు 'స్కోపోలమైన్‌'.. ఈ  సింథటిక్‌ డ్రగ్‌ సాధారణంగా ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. కొన్ని ఆపరేషన్లలో రోగులకు ఇచ్చే ఔషధాల్లో దీన్ని కలుపుతారు. అయితే ఇది సహజంగా లభించేది కాదు

TV9 Telugu

కొన్ని సహజ పదార్ధాలకు మరి కొన్ని రసాయనాలు కలపడం ద్వారా స్కోపోలమైన్‌ను కృత్రిమంగా తయారు చేస్తారు. ఘన, ద్రవ రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఉమ్మెత్త పువ్వు నుంచి తయారు చేస్తారట

TV9 Telugu

ఒకప్పుడు జనాలను పిచ్చోళ్లను చేసేందుకు ఉమ్మెత్త పువ్వుల్ని నూరి పాలలో కలిపేవారట. ఇప్పుడు ఏకంగా ఉమ్మెత్త ఉపయోగించి స్కోపోలమైన్‌ సింథటిక్‌ డ్రగ్‌ తయారు చేస్తున్నారు

TV9 Telugu

మెక్సికోలోని డ్రగ్ పెడ్లర్లు దీన్నితయారు చేసి ప్రపంచం అంతటా సరఫరా చేస్తున్నారు. స్కోపోలమైన్ డ్రగ్‌ను రెండో ప్రపంచ యుద్ధంలో ద్రవ రూపంలో ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారట

TV9 Telugu

ఈ డ్రగ్‌ను ప్రయోగించిన తర్వాత శత్రువులు తమ మెదడు మీద నియంత్రణ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారు. ఎవరితోనైనా నిజాలు చెప్పించేందుకు ఈ డ్రగ్‌ ఉపయోగించేవారు. మళ్లీ మాములు కావడానికి గంట నుంచి 3 గంటలు పడుతుంది

TV9 Telugu

మోసాలు, కిడ్నాపులు, ఇతర నేరాల కోసం స్కోపోలమైన్‌ను పౌడర్ రూపంలో ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్‌ను విజిటింగ్ కార్డు, క్లాత్, మొబైల్ స్క్రీన్‌ల ద్వారా ఇతరుల మీద ప్రయోగించడం చాలా తేలిక