భూమి మీద జన్మించిన ప్రతి జీవికి ఏదొక రోజు మరణించక తప్పదు. అన్ని జీవులకు వర్తించే ప్రకృతి నియమం. ఈ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జీవిస్తున్న ఒక ప్రాణి శాస్త్రవేత్తలు గుర్తించారు.
జెల్లీ ఫిష్‌గా పిలిచే ఓ జీవికి ప్రకృతి ‘అమరత్వ వరం’ ఇచ్చిందని చెబుతున్నారు సెంటిస్టులు. అవును ఈ జీవికి మరణం లేదు.
విచిత్రమైన శరీర నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది జెల్లీ ఫిష్. సముద్రపు లోతులలో నివసించే జెల్లీ ఫిష్.. కొన్నిసార్లు నీటి ఉపరితలంపై కూడా విహరిస్తాయి.
భూమిపై జెల్లీ ఫిష్ ఉనికి శతాబ్దాల నాటిదని చెబుతారు జంతు పరిశోధకులు. డైనోసార్ల కాలం నుంచి భూమిపై ఉనికిని కాపాడుకుంటున్న జెల్లీ ఫిష్.
95 శాతం పూర్తిగా నీటితో మాత్రమే తయారయ్యే శరీరంతో ఇతర సముద్ర జంతువులకు పారదర్శకంగా కనిపిస్తుంది ఈ అమరజీవి.
మెదడు లేని జెల్లీ ఫిష్ చుట్టూ చిన్న చేపల సమూహం ఎప్పుడూ ఉంటుందంటున్నారు సైంటిస్టులు. ఎందుకు అనుకుంటున్నారా.
జెల్లీ ఫిష్‌లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వాటి మీసాల్లో పాముల్లాగే విషం ఉంటుందంటున్నారు సైంటిస్టులు.
విషపూరితమైన జెల్లీ ఫిష్ మీసాలు మనిషి చర్మాన్ని తాకితే, వెంటనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదమే.