లడఖ్‌లో మార్స్‌‌లో ఉండే రాళ్ళను కనుగొన్న శాస్త్రవేత్తలు

TV9 Telugu

12 July 2024

లడఖ్ కొండల గురించి శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. ఇక్కడ అంగారక గ్రహాం లాంటి శిల ఉందని పరిశోధనలు రుజువు చేశాయి.

బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ (BSIP) శాస్త్రవేత్తలు ఇక్కడ విస్తృతమైన పరిశోధనలు చేశారు.

లడఖ్ రాళ్ల రంగులు, చిత్రాలు అంగారక గ్రహం నుండి వచ్చిన చిత్రాలతో సరిపోలుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

లడఖ్‌లోని రాక్ వార్నిష్ అంగారక గ్రహంలోని గోధుమ రంగులో మెరిసే రాళ్లను పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.

నాసా రోవర్ మార్స్‌కు పంపిన నమూనాలలో మాంగనీస్, ఇనుము వంటి మూలకాలు కనుగొన్నారు. లడఖ్‌లోని నలుపు-గోధుమ రాళ్లలో ఈ మూలకాలు కనుగొన్నారు.

అంగారక గ్రహం, లడఖ్ రాళ్లలో చల్లని వాతావరణం, ఆక్సిజన్ కొరత ఉందని తమ పరిశోధనలో పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.

అంగారకుడి చిత్రాలను, లడఖ్‌లోని రాళ్లను పోల్చి చూసినప్పుడు అవి ఒకేలా ఉన్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

రెండు రాళ్లలో కూడా మాంగనీస్, ఇనుము ఉన్నట్లు తేలింది. భారత్ చేపట్టిన మిషన్ మార్స్ విజయవంతం కావడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుంది.